జనవరి 11 తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఫారం-7 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదని స్పష్టం చేశారు.
నకిలీ దరఖాస్తులపై పోలీసు కేసులు మొదలవగానే దరఖాస్తులు ఆగిపోయాయని తెలిపారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీల వైఖరి సరికాదన్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదని హితవు పలికారు. పార్టీల నేతలు ఫారం-7పై ఈసీకి అభ్యంతరాలు చెబుతూ...బయటకు వెళ్లి ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారని జీకే ద్వివేదీ ఆక్షేపించారు. ఓట్లు ఎక్కడ తొలగించారో నిరూపించాలని నేతలను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటు హక్కు లేదని గుర్తించామన్నారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేస్తుందని... ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావొద్దన్నారు.
ఇదీ చదవండి.
నేతలూ.. నిరూపించండి: ద్వివేది - ద్వివేది
ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీల వైఖరి సరికాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. జనవరి 11 తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు తొలగించలేదని ద్వివేది స్పష్టం చేశారు. పార్టీల నేతలు ఫారం-7పై ఈసీకి అభ్యంతరాలు చెబుతూ... బయటకు వెళ్లి ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారని ఆక్షేపించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది