అమరావతి సచివాలయంలోని 3, 4 బ్లాక్‌ల్లో పని చేసే ఉద్యోగులను సోమవారం విధులకు హాజరు కావొద్దని ఉద్యోగుల సంఘం సూచించింది. ఈ బ్లాక్‌లలో సంక్షేమ, వ్యవసాయం, విద్యా, పరిశ్రమలు, జలవనరుల శాఖలతో పాటు క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. 3, 4 బ్లాక్‌లలో పని చేసే ఉద్యోగులలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో జాగ్రత్తలు పాటించాలని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు బ్లాక్‌లను శానిటైజ్ చేస్తున్నామన్నారు.
'3, 4 బ్లాక్‌ల్లో ఉద్యోగులు విధులకు రావొద్దు' - undefined
అమరావతి సచివాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో 3,4 బ్లాక్‌లలో పని చేసే ఉద్యోగులు సోమవారం విధులకు రావొద్దని ఉద్యోగుల సంఘం సూచించింది.
రేపు విధులకు రావొద్దు
కరోనా సోకిన ఉద్యోగితో సన్నిహితంగా ఉన్నవారు హోమ్ క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనుమానిత లక్షణాలు ఉంటే డిస్పెన్సరీ వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
Last Updated : Jun 1, 2020, 6:13 AM IST
TAGGED:
SECRETARIAT