తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం కాకడ్‌బొడ్డికి చెందిన ఆత్రంభీం... సంభాజిగూడెంలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో పొలంలో విద్యుదాఘాతానికి గురైన భీం.. అక్కడే కుప్పకూలిపోయాడు.
విద్యుదాఘాతానికి గురై యజమాని మృతి.. పెంపుడు శునకం మౌనరోదన - Dog crying for owner in Asifabad
తన ఆకలి తీర్చి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న యజమాని చలనం లేకుండా పడి ఉండడం చూసి ఆ మూగజీవి తట్టుకోలేకపోయింది.. శాశ్వతంగా దూరమయ్యాడని అనుకుందేమో మృతదేహం వద్ద నుంచి కదలకుండా మౌనంగా రోదించింది ఆ శునకం. మాటలే వచ్చి ఉంటే బోరున విలపించేదేమో.. ఇలా గంటలకొద్దీ ఘటన స్థలంలోనే ఉండడం చూసి మూగజీవి ప్రేమకు విలువ కట్టలేమంటూ కన్నీరుమున్నీరయ్యారు అక్కడికి వచ్చినవారు.
మృతదేహం వద్ద పెంపుడు కుక్క
దీనిని గమనించిన అతని పెంపుడు కుక్క... యజమానిని తట్టిలేపేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది. భీం ఎంతకూ కళ్లు తెరవకపోవటంతో.... మృతదేహం చుట్టే తిరుగుతూ, మౌనంగా రోదించింది. ఈ ఘటన అక్కడున్న వారి కళ్లు చెమర్చేలా చేసింది.
- ఇదీ చదవండి :విద్యార్థుల చదువులపై ఇంకా వీడని కరోనా ప్రభావం