రెండు దశాబ్దాలకుపైగా న్యాయ వివాదాల్లో నలుగుతున్న గ్రూపు-2 (1999) అభ్యర్థుల భర్తీ ప్రక్రియ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కొత్త మలుపు తిరిగింది. ఈ తీర్పునకు అనుగుణంగా... ఏపీపీఏస్సీ 2018 మే 10న ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను అనుసరించి చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈనెల 4న మెమో జారీ చేసింది. అయితే... ఏపీపీఎస్సీ జాబితాలో స్థానిక, స్థానికేతరుల కోటా ఎంపికలో తప్పులు దొర్లాయని, దీన్నే ప్రామాణికంగా తీసుకుంటే తాము నష్టపోతామని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుత ఉత్తర్వులతో 200 మంది ఉద్యోగ స్థానాలు మారతాయి. ఇప్పటికే వాణిజ్య పన్నులశాఖలో ఏసీటీఓగా పని చేస్తున్న అభ్యర్థి ఎక్సైజ్‌శాఖలో ఎస్‌ఐ, రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు మారాల్సి వస్తుంది. 16 ఏళ్ల నుంచి పని చేస్తున్న అభ్యర్థుల్లో సుమారు 75 మంది భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారైంది. పలువురు ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి మారాల్సిన వస్తుంది.
ఒక నోటిఫికేషన్... మూడు విడతల నియామకాలు
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 10 ప్రభుత్వ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ (104 పోస్టులు), ఏడు శాఖల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ (141) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 1999 డిసెంబరు 28న గ్రూప్-2 నోటిఫికేషన్ జారీచేసింది. దీని ద్వారా 2000 ఆగస్టు 31 నాటికి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామంది. 2000 డిసెంబరులో 104 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 141 పోస్టులను ఉపసంహరించుకోవడాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ తప్పుబట్టింది. దీంతో 141 ఏఎస్‌వో పోస్టులను 2002లో ఏపీపీఎస్సీ రెండో విడత భర్తీచేసింది. మిగిలిన శాఖల్లో ఖాళీగా ఉన్న వందలాది పోస్టుల కోసం నిరుద్యోగులు ట్రైబ్యునల్, హైకోర్టులను ఆశ్రయించారు. ఫలితంగా మూడో విడతలో 2005లో అదనంగా 973 ఎగ్జిక్యూటివ్, 199 నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీచేసింది. మొదటి విడత 104 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల ప్రకారం 1975 నవంబరు 15నాటి 763 జీవోను అమలుచేసింది. అయితే... 2005లో అదనంగా వచ్చిన పోస్టుల భర్తీ విషయంలో మాత్రం ట్రైబ్యునల్, హైకోర్టుల తీర్పుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2002 మార్చి 7న ఇచ్చిన 124 జీవోను అమలుచేసింది. మొదటి రెండు విడతల్లో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులను మినహాయించి 2005లో అదనంగా వచ్చిన పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు నాటి తీర్పులో పేర్కొంది. సచివాలయంలో ఏఎస్‌వోలను ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లోకి ఎంపిక చేయకపోవడాన్ని నిరసిస్తూ వారు 2005లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సుప్రీంకోర్టు 2015, 2018, 2021 సంవత్సరాల్లో తీర్పులు వెలువరించింది. తన తీర్పుల్లో స్పష్టతనిస్తూ సుప్రీంకోర్టు గతనెలలో మరో తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వం ఇటీవల జారీచేసిన మెమోలో ఏపీపీఎస్సీ 2018 మే 10న ప్రకటించిన అభ్యర్థుల జాబితాకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలంది.
2018 జాబితాతోనే సమస్య!