ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విద్యుత్ టారిఫ్​ సవరణలపై డిస్కంల ప్రతిపాదనలు'

హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో ఏపీఈడీసీఎల్, ఎస్​పీడీసీఎల్ డిస్కంల సీఎండీలు సమావేశమయ్యారు. విద్యుత్ ధరల సవరణలపై చర్చించారు. అనంతరం ధరల సవరణలపై ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ ఛైర్మన్​కి సమర్పించారు.

By

Published : Dec 4, 2019, 10:01 PM IST

Published : Dec 4, 2019, 10:01 PM IST

Discoms meet at Hyderabad on tariff  changes
'విద్యుత్ టారిఫ్​ సవరణలపై డిస్కంల ప్రతిపాదనలు'

'విద్యుత్ టారిఫ్​ సవరణలపై డిస్కంల ప్రతిపాదనలు'
ఏపీఈడీసీఎల్, ఎస్​పీడీసీఎల్ డిస్కంలు విద్యుత్ ధరల సవరణ అనుమతి కోరుతూ... ఏపీఈఆర్సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డికి ప్రతిపాదనలు సమర్పించాయి. హైదరబాద్​లోని సింగరేణి భవన్​లో సమావేశమైన డిస్కంల సీఎండీలు... ఛైర్మన్​కు ప్రతిపాదనలు అందజేశారు. ధరల పెంపుపై ప్రజలు, విద్యుత్ వినియోగ సంస్థల అభిప్రాయ సేకరణ త్వరలోనే చేస్తామని ఏపీఈఆర్సీ ఛైర్మన్ పేర్కొన్నారు. అనంతరం డిస్కంల సీఎండీలు విద్యుత్ సవరణలకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ నిర్వహణకు ఏడాదికి రూ.16,292.45 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంటుందని... ప్రస్తుత టారిఫ్ ప్రకారం రూ.12,152.39 కోట్ల ఆదాయం సమకూరుతున్నప్పటికీ ఇంకా సంస్థకు రూ.4,140.06 కోట్ల ఆర్థికలోటు ఉందని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి తెలిపారు.

ఆర్థిక లోటు భర్తీ

ఆర్థికలోటు భర్తీకి విద్యుత్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తే.. రూ.514.43 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. నూతన టారిఫ్​ను అమలు చేసినప్పటికీ.. ఇంకా రూ.3,625.63 కోట్ల ఆర్థికలోటు ఉంటుందని పేర్కొన్నారు. ఎస్​పీడీసీఎల్ పరిధిలో వార్షిక ఆదాయం రూ.28,548.51 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని... టారిఫేతర, ఇతర సబ్సిడి సర్​ఛార్జీల నుంచి రూ.18,247.33 కోట్ల ఆదాయం విద్యుత్ శాఖకు వస్తుందన్నారు. ఎస్​పీడీసీఎల్ రూ.10,301 కోట్ల ఆర్థికలోటులో ఉందని ఆ సంస్థ సీఎండీ హరినాథరావు పేర్కొన్నారు. నూతన టారిఫ్ అమలు చేస్తే రూ.19,106.17 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన టారిఫ్ అమలు చేసినా.. ఇంకా రూ.9,442.35 కోట్ల ఆర్థికలోటు ఉంటుందన్నారు.

ఛార్జీల సవరణ

ఏపీఈడీసీఎల్​లో ఎల్​టీ(లో టెన్షన్ విద్యుత్)-1 గృహవసరాలు, ఎల్​టీ-2 వాణిజ్య అవసరాలు, ఎల్​టీ-3 పరిశ్రమలు, ఎల్ టీ- 4 సాధారణ అవసరాలు, ఎల్​టీ-5 వ్యవసాయం, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, హెచ్​టీ(హై టెన్షన్ విద్యుత్)-3 భారీ పరిశ్రమలు, హెచ్​టీ-5 ఆక్వా, ఎల్​టీ, హెచ్​టీ-4సీ ఆధ్యాత్మిక ప్రదేశాలకు సంబంధించిన టారీఫ్​లలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. ఎల్​టీ-2, హెచ్​టీ-2 ఫంక్షన్ హాల్స్, హెచ్​టీ-2 వాణిజ్య సముదాయాలు, ఎల్​టీ-4 స్థానిక సంస్థలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, సీపీడబ్ల్యూఎస్, పీ.డబ్ల్యూఎస్, రైల్వే సంస్థలు, ఎల్​టీ-5 కార్పొరేట్, రైతులు, హేచరీస్, పశుదాన కేంద్రాలు.. హెచ్​టీ-5 హేచరీస్, పశుదాన కేంద్రాలు, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ఛార్జీలు సవరించేందుకు ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు.

ఇదీ చదవండి :

'ఇకపై ఆ ఆస్తుల బాధ్యత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్​దే..!'

ABOUT THE AUTHOR

...view details