తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు సమ్మక్కసారలమ్మలను దర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మలకు పసుపు కుంకుమ, చీరలు సమర్పించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు.
మేడారానికి పోటెత్తిన భక్తులు.. మొక్కులు చెల్లింపులు
తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. అమ్మల సన్నిధికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం(బెల్లం), పసుపు కుంకుమ, పువ్వులు, ఒడి బియ్యం, కొబ్బరి కుడుకలు సమర్పించారు. శుక్రవారం కావడం వల్ల సమ్మక్క-సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకునేందుకు గద్దెల వద్ద భక్తులు పోటెత్తారు. సమ్మక్క-సారలమ్మల గుడి గేట్లు మూసివేయడం వల్ల బయటి నుంచే భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
- ఇదీ చూడండి :ఓ వ్యక్తి మరణానికి కారణమైన కోడి అరెస్టు