కేఆర్బీఎం(Krishna River Management Board) నియంత్రణ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురాకుండా.. జగన్ రెడ్డి ఎందుకు లాలూచీ పడ్డారని మాజీమంత్రి దేవినేని ఉమ (devineni uma) నిలదీశారు. రాబోయే రోజుల్లో 150టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ సిద్దమవుతుంటే.. రాష్ట్ర రైతాంగం గొంతు కోసేవిధంగా జగన్ రెడ్డి వ్యవహరించారని దుయ్యబట్టారు.
devineni uma: ఆ ఒప్పందంతో.. రాష్ట్ర రైతుల గొంతు కోశారు: దేవినేని ఉమ - దేవినేని ఉమ జగన్పై విమర్శలు
కేఆర్బీఎం (Krishna River Management Board) సమావేశంలో.. జూరాల ప్రాజెక్టు విషయమై ఏపీ సర్కారు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ (devineni uma) మండిపడ్డారు. ఈ విషయంలో జగన్ రెడ్డి సర్కారు తీరు.. రాష్ట్ర రైతుల గొంతు కోసే విధంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
కేఆర్బీఎం (Krishna River Management Board) సమావేశంలో జూరాలపై నియంత్రణ లేకుండా ఏపీ అధికారులు ఒప్పందాలపై ఎలా సంతకాలు పెట్టారని మండిపడ్డారు. ఇది రాయలసీమ రైతులకు తీరని ద్రోహం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016లో రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో తొలి ప్రాజెక్టు జూరాల ఉండేలా చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించారని గుర్తుచేసిన ఉమా.. (devineni uma) జగన్ రెడ్డి మాత్రం రాష్ట్ర రైతుల ప్రయోజనాలు తాకట్టుపెట్టేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:AP employees: ఉద్యోగుల పీఆర్సీ సమస్య పరిష్కారం.. అప్పుడే : సజ్జల