రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వాటికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్.. ఉండవల్లి కరకట్ట రహదారిలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం కరకట్ట కింద పొలం పనులు చేసుకుంటున్న రైతుల ముందు పోలీసులు ఆయుధాలు చేతబూని కాపలా కాశారు. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్యలు తీసుకున్నారు.
అడవిలో అక్కలు కాదు.. అమరావతిలో రైతులు..! - అమరావతి రైతులు తాజా వార్తలు
ఈ చిత్రంలో చూస్తున్న వీరు అంతా.. మావోయిస్టులో, ఉద్యమకారులు కాదు. అలా అని పొలాల్లో గంజాయి పండించే వారు కూడా కాదు. మరి వీరి ముందు ఇలా పోలీసులు తుపాకులు చేతబూని ఎందుకు పహారా కాస్తున్నారు అంటే.. వారు అమరావతి రైతులు కాబట్టి.
amaravathi