ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

School Education On Merging: 'హైస్కూళ్లలో 100లోపు విద్యార్థులుంటే విలీనం వద్దు'

merging schools: పాఠశాలల విలీనంపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లోకి ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను విలీనం చేయకూడదని ఉత్తర్వులు విడుదల చేసింది.

పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు
పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు

By

Published : Dec 11, 2021, 11:28 AM IST

school education on merging schools: రాష్ట్రంలో 100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లోకి ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను విలీనం చేయకూడదని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య బడిలో మాత్రమే కలపాలని, గిరిజన సంక్షేమ పాఠశాలలను ప్రస్తుతానికి విలీన ప్రక్రియ నుంచి మినహాయించాలని సూచించింది.

  • కిలోమీటరు లోపు వేరే మండలం పాఠశాల ఉన్నా యాజమాన్యం ఒక్కటే అయితే తరగతులను విలీనం చేస్తారు.
  • 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను విలీనం చేయరు.
  • ఉన్నత పాఠశాలల్లో వెయ్యి మంది కంటే ఎక్కువ పిల్లలున్న వాటిలోనూ 3, 4, 5 తరగతులను కలపరు.

ABOUT THE AUTHOR

...view details