Raghurama Case: ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు - ఏపీ తాజా వార్తలు
14:18 May 28
నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు తీరు, తదనంతర పరిణామాలపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడి విషయంలో అంతర్గత విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఎంపీ రఘురామ అరెస్టు తీరుపై ఆయన కుమారుడు భరత్ ఫిర్యాదు చేయగా జాతీయ మానవహక్కుల సంఘం స్పందించింది. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి స్పష్టం చేసింది.
ఇదీ చదవండి
యువకుడి దారుణ హత్య.. ముక్కలుగా నరికి చంపాడు.. కుమార్తెను ప్రేమించాడనే..