ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana: తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్.. థర్డ్ వేవ్ టెన్షన్

తెలంగాణలో బడుల పునఃప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవటంతో పాటు.. జూలై 1 నుంచి పాఠశాలలను తెరవనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల తల్లిదండ్రులు కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ తో ఉన్నారు

Telangana
Telangana

By

Published : Jun 19, 2021, 7:04 PM IST

Updated : Jun 21, 2021, 4:36 PM IST

కరోనా కారణంగా మూతపడ్డ విద్యాసంస్థలన్నీ తెలంగాణలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుపై సందిగ్ధత నెలకొంది. కరోనా జాగ్రత్తలు తీసుకోకపోతే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం.. నేడు విధివిధానాలను ఖరారు చేయనుంది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యక్ష తరగతులను నిర్వహించటాన్ని స్వాగతిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తరువాత ఏపీ ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Last Updated : Jun 21, 2021, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details