భవన నిర్మాణ కార్మికులకు రూ. 10వేలు ఇవ్వాలని సీపీయం రాష్ట్ర కార్యదర్శి మధు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం జగన్ను కలిసిన ఆయన...భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. బోర్డు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీనిచ్చారు. కంటైన్మెంట్, రెడ్ జోన్ల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు మధు తెలిపారు.
'భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి' - building workers problems in ap
ముఖ్యమంత్రి జగన్ను సీపీయం నేత మధు కలిశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
cpm madhu