సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీలో వరదను జాతీయ విపత్తుగా గుర్తించి ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఐదు జిల్లాల్లో 2 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని రామకృష్ణ తెలిపారు. రెండు డ్యామ్‌లు, చెరువులు, కాల్వలకు గండిపడి రైతులు, ప్రజలు చాలా నష్టపోయారని స్పష్టం చేశారు. కేంద్ర బృందం పర్యటించి సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి.. ఏపీకి వరద సహాయక నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
CPI RAMAKRISHNA LETTER TO PM: ప్రధాని మోదీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ - ap 2021 news
ప్రధాని మోదీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో వరదను జాతీయ విపత్తుగా గుర్తించి.. వెంటనే సహాయక నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ