ముఖ్యమంత్రి జగన్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. సీఎం ఇంట్లోనే పుట్టుకొస్తుందనే విషయం త్వరలోనే తెలుస్తుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో మీడియాతో మాట్లాడిన రామకృష్ణ.. కూర్చున్న కొమ్మనే జగన్ నరుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికలు సాధారణ పరిస్థితిలో జరగటం లేదన్నారు. నామినేషన్లు వేసిన 13 నెలల తరువాత పోలింగ్ జరుగుతుంటే, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు కోరినా ఎస్ఈసీ పట్టించుకోలేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి జగన్ ప్రభుత్వంలోనే చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ఇంట్లోనే ప్రతిపక్షం పుట్టుకొస్తుంది: రామకృష్ణ
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని సీఎం జగన్ చేస్తున్నా.. ఆయన ఇంట్లోనే పుట్టుకొస్తుందనే విషయం త్వరలోనే తెలుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.
cpi ramakrishna fiers on jagan