ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం నిర్ణయం హర్షణీయం : సీపీఐ రామకృష్ణ

అమరావతిని రాజధానిగా నిర్ధరిస్తూ కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించటం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సీఎం జగన్‌ ఇప్పటికైనా తన పట్టుదలను వీడి.. రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని వివాదానికి తెరదించాలి
ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని వివాదానికి తెరదించాలి

By

Published : Mar 2, 2022, 10:33 PM IST

అమరావతిని రాజధానిగా నిర్ధరిస్తూ కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించటం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని వివాదానికి తెరదించాలని డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలన్నారు. రాజధానికి కేంద్రం నిధులు కేటాయిస్తే.. ఈపాటికే అభివృద్ధి చెందేదని అన్నారు. అమరావతి రైతులు పోరాడే పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌ ఇప్పటికైనా తన పట్టుదలను వీడి.. రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

"అమరావతిని రాజధానిగా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడం హర్షణీయం. ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని వివాదానికి తెరదించాలి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలి. రాజధానికి కేంద్రం నిధులు కేటాయిస్తే ఈపాటికే అభివృద్ధి చెందేది. సీఎం జగన్‌ ఇప్పటికైనా తన పట్టుదల వీడాలి. రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి." -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

రాజధాని అమరావతి పేరుతో బడ్జెట్‌లో ప్రొవిజన్‌..
రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రొవిజన్‌ పెట్టింది. అమరావతినే రాజధానిగా పేర్కొంటూ.. ప్రాథమికంగా లక్ష రూపాయలు కేటాయించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిధులు కేటాయించింది.

సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌కు రూ.1,126 కోట్లు, దానికి సంబంధించిన భూసేకరణకు రూ. 21 కోట్లు అవసరమని లెక్కగట్టింది. ఈ భూసేకరణకు రూ.18.3 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

300 ఏజీ స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి రూ.200 కోట్లు కావాలని అంచనా వేసింది. ఇక జీపీవోఏ భూసేకరణ వ్యయం రూ.6.69 కోట్లుగా లెక్క కట్టగా... 2020-21, 2021-22 బడ్జెట్ల ద్వారా రూ.4.48 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ చదవండి

ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు

ABOUT THE AUTHOR

...view details