కృష్ణా జలాల విషయంలో సీఎం జగన్ (cm jagan).. మెతక వైఖరి కనబరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI RamaKrishna) విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం నదీ జలాల పంపకాల సమయంలోనే 299 టీఎంసీలు తెలంగాణాకు, 511 ఆంధ్రప్రదేశ్ వాటాగా నిర్ణయించిన విషయం గుర్తు చేశారు. అప్పుడు అంగీకరించిన కేసీఆర్ (CM Kcr) ఇప్పుడు మాట మార్చి నదీ జలాల్లో చెరో సగం వాటా అనటాన్ని తప్పుబట్టారు.
సీఎం జగన్ కు దిల్లీలో విలువ లేదన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నా చలనం లేకపోవటం సరికాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలన్నా, ప్రజలన్నా గౌరవం లేదన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రజలు మేల్కొనకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారం కానుందని హెచ్చరించారు.