Hyderabad Drugs Case: హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రాడిసన్ హోటల్‌లోని పుడింగ్ అండ్ మింట్ పబ్‌లో బయటపడిన డ్రగ్స్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే కునాల్, డీజే ఆపరేటర్ వంశీధర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటింటారు.
పోలీసుల సీరియస్ ఫోకస్ : ఈ డ్రగ్స్ కేసుపై పోలీసు అధికారులతో సీపీ ఆనంద్ అత్యవసరంగా భేటీ అయ్యారు. పలువురు పోలీసుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీవీ ఆనంద్.. వెస్ట్‌జోన్‌లోని ఆయా పీఎస్‌ల ఎస్సైలు, డిటెక్టివ్ సీఐలు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే.. పబ్‌లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను పోలీసులు ల్యాబ్‌కు పంపించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం డ్రగ్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. వెస్ట్‌జోన్, బంజారాహిల్స్, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.