ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎక్కువ మంది ఒకచోట గుమిగూడితే ముప్పే..! - కరోనా వార్తలు

కరోనా కేసులు రోజురోజూకు పెరుగుతున్నాయి. అయితే సమూహ వ్యాప్తి ద్వారా కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో ఎక్కువవుతున్నాయి.

Corona positive cases by group outbreak
రాష్ట్రంలో సమూహ వ్యాప్తి ద్వారా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

By

Published : May 6, 2020, 7:46 AM IST

సమూహ వ్యాప్తి ద్వారా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం ఉదయం వరకు నమోదైన 1,717 పాజిటివ్‌ కేసుల్లో దిల్లీ నుంచి వచ్చినవారు 269 మంది ఉన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 29 వేల మందిలో 17 మంది వైరస్‌ బారిన పడ్డారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ కింద వరుసగా 571, 190 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం గుర్తించిన కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్లలో 382 కేసులు నమోదయ్యాయి. ఒకేచోట ఎక్కువ కేసులు నమోదైతే ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్‌గా గుర్తిస్తోంది.

సమూహ వ్యాప్తి జరిగిందిలా..

  • విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఒక లారీడ్రైవర్‌ లోడ్‌తో పశ్చిమబెంగాల్‌కు వెళ్లి, అక్కడినుంచి ఒడిశా మీదుగా విజయవాడ చేరుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ల ఇంట్లో చుట్టుపక్కల వారితో పేకాట, హౌసీ నిర్వహించారు. అతడితో పాటు.. మొత్తం 24 మంది వ్యాధి బారిన పడ్డారు.
  • విజయవాడలోనే మాచవరం కరెన్సీనగర్‌ ప్రాంతంలో టీ అమ్ముకునే ఒక యువకుడి నుంచి 36 మందికి వ్యాధి సోకింది. వీళ్లంతా అతడి వద్ద టీ తీసుకున్నారు. ఇలాగే ఇతర జిల్లాల్లోనూ ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటం, ఒకరు తాకిన వస్తువులను మరొకరు తాకడం వంటి కారణాలతో కరోనా వ్యాపించిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. తాజాగా మద్యం దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం పాటించకుండా భారీ సంఖ్యలో ఒకేచోట గుమిగూడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

136 మంది ఉద్యోగులకు వైరస్‌

వైరస్‌ బారినపడే వారిలో ఉద్యోగులూ ఉంటున్నారు. ఇప్పటివరకు 136 మంది ఉద్యోగులు వైరస్‌ బారిన పడగా వీరిలో 56 మంది వైద్య ఆరోగ్యశాఖకు చెందినవారు. పోలీసు, ఇతర శాఖల ఉద్యోగుల్లో 80 మంది వరకున్నారు.

  • లక్షణాలు కనిపించి తమకు తామే ఆసుపత్రులకు రాగా పాజిటివ్‌ అని నిర్ధారించిన వారి సంఖ్య 14 వరకు ఉంది.
  • మిగిలిన వారిలో ఇంటింటి సర్వే, ర్యాండమ్‌గా నమూనాల సేకరణ, ఇతర మార్గాల్లో గుర్తించినవారు ఉన్నారు.

ఇవీ చదవండి...మా పయనం ఆగదు...!

ABOUT THE AUTHOR

...view details