ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యాదాద్రిపై కరోనా ప్రభావం.. భారీగా తగ్గిన ఆదాయం - కొవిడ్​తో తగ్గిన యాదాద్రి ఆదాయం

కరోనా దెబ్బకు తెలంగాణలోని యాదాద్రి ఆలయం కళ తప్పింది. ఆలయ పరిసరాలు బోసిపోతున్నాయి. స్వామివారి లడ్డూలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఈ పరిణామాలు దేవస్థాన ఖాజానాకు గండికొట్టాయి. ఆదివారం నుంచి ఆలయంలో ఆర్జిత పూజలు మొదలు కానుండగా.. ఆదాయం పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

corona effect on yadadri temple, yadadri temple income decreased due to covid
యాదాద్రిపై కరోనా ప్రభావం, యాదాద్రికి భారీగా తగ్గిన ఆదాయం

By

Published : Apr 3, 2021, 8:46 PM IST

యాదాద్రిపై కరోనా ప్రభావం, యాదాద్రికి భారీగా తగ్గిన ఆదాయం

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంపై కొవిడ్ ప్రభావం కనిపిస్తోంది. కరోనా దెబ్బకు ప్రసాద విక్రయాలు మరింత క్షీణించాయి. నాలుగు రోజులుగా భక్తుల రాక తగ్గిపోవడంతో.. లడ్డూ ప్రసాదం నిల్వలు పేరుకుపోయాయి. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఇష్టంగా స్వీకరించే ప్రసాదం, లడ్డూ, పులిహోరపై కరోనా ప్రభావం పడింది.

ఆలయ సిబ్బందికి కరోనా సోకడమే కారణమా?

యాదాద్రి ఆలయ బ్రహ్మోత్సవాల్లో పూజారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది వైరస్ బారిన పడడంతో.. ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు నిర్ణయించారు. దీనికి తోడు వేసవిలో ఎండలు పెరగడంతో భక్తుల రాక పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా నాలుగు రోజులుగా తయారుచేసిన లడ్డూ ప్రసాదం నిల్వలు పేరుకుపోయాయి.

ఆదాయం తగ్గింది..

ప్రసాదం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. శని, ఆదివారాల్లో రద్దీ సమయాల్లో 25వేల లడ్డూ ప్రసాదాలు విక్రయించడం వల్ల ఖజానాకు రూ.5 లక్షల ఆదాయం సమకూరేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు 11వేలు విక్రయిస్తుండగా రూ.2.20 లక్షల ఆదాయం వచ్చేదంటున్నారు.

ఆరు రోజులుగా అరవై వేలే...

భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో ఆరు రోజులుగా కేవలం రూ.60 వేల లడ్డూలు మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. బెల్లం లడ్డూలను పూర్తిగా నిలిపివేయడంతో రూ.10 వేల ఆదాయం తగ్గిపోయింది. ప్రతి శని, ఆదివారాల్లో పులిహోర ప్యాకెట్లపై రూ. లక్ష వస్తుండగా.. ప్రస్తుతం కేవలం రూ.21వేల ఆదాయం మాత్రమే వస్తోందని అధికారులు వెల్లడించారు. ప్రసాద విక్రయాలపై వచ్చే దాదాపు 75% ఆదాయానికి గండి పడిందని పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఆలయంలో ఆర్జిత సేవలు మొదలుకానుండగా.. ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:

కరోనా దృష్ట్యా ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి వాయిదా: తితిదే

ABOUT THE AUTHOR

...view details