ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఖజానాపై కరోనా ప్రభావం - telangana varthalu

కరోనా విపత్కర వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆర్థిక సంవత్సంలో లక్షా 34వేల కోట్ల రూపాయలు వ్యయం చేసింది. రెవెన్యూ ఆదాయం 99వేల కోట్లు కాగా... 45వేల కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకొంది. పన్ను ఆదాయం అంచనాలను 77శాతానికిపైగా చేరుకొంది. పన్నేతర ఆదాయంలో కేవలం 16శాతం అంచనాలను మాత్రమే అందుకొంది.

Corona effect on state government treasury
Corona effect on state government treasury

By

Published : May 14, 2021, 8:30 AM IST

గడిచిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. 2020-21 ఆర్థికసంవత్సరానికి లక్షా 82వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే కొవిడ్ మహమ్మారి ఈ అంచనాలను భారీగా దెబ్బతీసింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం లక్షా 34 వేల కోట్ల రూపాయలు. లక్షా 60వేల కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించగా అందులో 83శాతం అంచనాలను చేరుకొంది. చేసిన వ్యయంలో రెవెన్యూ వ్యయం లక్షా 18వేల కోట్ల రూపాయలు కాగా... మూలధన వ్యయం 16వేలా 181 కోట్లుగా ఉంది. ఆదాయం పరంగా చూస్తే రెవెన్యూ రాబడులు 99 వేలా 903 కోట్ల రూపాయలు. మూలధన రాబడులు 45 వేలా 696 కోట్లు. 2020-21లో రాష్ట్ర ప్రభుత్వం 45వేలా 638కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకొంది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం భారీగా తగ్గడంతో సర్కార్ ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వచ్చింది.

ప్రభుత్వ ఆదాయంలో... పన్ను ఆదాయం అంచనాలను 77శాతం అందుకొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం అంచనా లక్షా రెండు వేల కోట్ల రూపాయలు కాగా... 79వేలా 339కోట్లు వచ్చాయి. పన్ను ఆదాయం ఏప్రిల్ నెలలో కేవలం 1700కోట్లు రాగా... గరిష్టంగా మార్చి నెలలో 11,376 కోట్ల రూపాయలు వచ్చాయి. జూన్ నెల నుంచి పన్ను వసూళ్లు క్రమంగా పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపంలో 25వేల కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 20వేల కోట్ల రూపాయలు ఖజానాకు వచ్చాయి. ఎక్సైజ్ పన్ను ద్వారా 14వేల కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా 5243కోట్లు వచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 8976కోట్ల రూపాయలు వచ్చాయి. గ్రాంట్ల రూపంలో 15471 కోట్లు రాష్ట్రానికి అందాయి. పన్నేతర ఆదాయం బాగా తగ్గింది. బడ్జెట్ అంచనాల్లో పన్నేతర ఆదాయం 30600కోట్ల రూపాయలు పేర్కొనగా... కేవలం 16శాతం 3091 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి.

తెలంగాణ: ఖజానాపై కరోనా ప్రభావం

ఇదీ చదవండి:

ఆస్పత్రుల్లో పడకల మేరకు ఆక్సిజన్‌ సరఫరా ఉండాల్సిందే: సీఎం

‘ప్రాణవాయువు రథచక్రాలు’ వచ్చేశాయ్‌!

ABOUT THE AUTHOR

...view details