ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా కంట్రోల్: సీఎం సహాయనిధికి పలు సంస్థలు విరాళం

By

Published : Apr 23, 2021, 8:19 PM IST

కొవిడ్‌ నివారణ కోసం సీఎం సహాయనిధికి పలు సంస్థలు విరాళం ఇచ్చాయి. కాకినాడకు చెందిన పలు సంస్థలు రూ.కోటీ 33 లక్షలు విరాళం ఇచ్చాయి. కాళేశ్వరీ రిఫైనరీ రూ.25 లక్షలు విరాళం ఇచ్చింది. రూ.14.2 లక్షలు రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాలు ఇచ్చాయి. ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మూర్తి రూ.15 లక్షలు, వేద సీడ్‌ సైన్స్‌ సంస్థ రూ.10 లక్షలు విరాళం ఇచ్చింది. విరాళాల చెక్కులను సీఎం జగన్‌కు మంత్రి కన్నబాబు అందించారు.

సీఎం సహాయనిధికి పలు సంస్థలు విరాళం
సీఎం సహాయనిధికి పలు సంస్థలు విరాళం

రాష్ట్రంలో కొవిడ్‌ కంట్రోల్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు రూ.కోటీ 33 లక్షల 34 వేల 844 విరాళం అందించాయి. కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్‌ లక్ష రూపాయలు, భవాని కాస్టింగ్స్‌ ప్రైవేట్​ లిమిటెడ్‌ 5 లక్షల విరాళం అందించాయి. ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్, విజయవాడ 14 లక్షల 20 వేలు, వేద సీడ్‌ సైన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ 10 లక్షలు, ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ పీవీఎస్‌ఎస్‌ మూర్తి 15 లక్షల విరాళం ఇచ్చారు. కాళేశ్వరీ రిఫైనరీ అండ్‌ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్‌ 25 లక్షలు, సహా పలు సంస్థలు విరాళం ఇచ్చాయి. చెక్కులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details