ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 12,634 కేసులు - today corona cases in ap

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 12,634 కేసులు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 12,634 కేసులు

By

Published : Apr 25, 2021, 5:59 PM IST

Updated : Apr 26, 2021, 3:28 AM IST

17:55 April 25

ఏపీలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా రెండో దశ సునామీలా విరుచుకుపడుతోంది. కేవలం 12 రోజుల వ్యవధిలో లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13 నాటికి 9,32,892గా ఉన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 10,33,560కు చేరింది. గతేడాది నవంబరు 3 నాటికి 8,30,731గా ఉన్న కరోనా కేసులు 9,32,892కు (లక్షకు పైగా) చేరటానికి 161 రోజుల సమయం పట్టగా.. ఈసారి అతి తక్కువ వ్యవధిలో అత్యంత వేగంగా లక్ష కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 12,634 కొత్త కేసులొచ్చాయి. వైరస్‌ బారినపడిన వారిలో తాజాగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండో దశలో కరోనా ఉద్ధృతికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 62,885 నమూనాలను పరీక్షించగా.. అందులో 20.09 శాతం మందికి కొవిడ్‌ ఉన్నట్లు తేలింది.పరీక్షించుకున్న ప్రతి అయిదుగురిలో ఒకరికి కరోనా నిర్ధారణైంది. శ్రీకాకుళం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 7,685 మంది కరోనాతో మృతిచెందారు.

ఏడు జిల్లాల్లో 74.76 శాతం కేసులు
*24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 9,446(74.76 శాతం) ఏడు జిల్లాల్లోనే వచ్చాయి. అత్యధికంగా శ్రీకాకుళంలో(1,680), చిత్తూరు(1,628), గుంటూరు(1,576), నెల్లూరు(1,258), కర్నూలు(1,158), అనంతపురం(1,095), విశాఖపట్నం(1,051)లోనే ఈ కేసులన్నీ ఉన్నాయి.
*రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 89,732కు చేరింది. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధిక క్రియాశీలక కేసులున్నాయి.

అత్యధికంగా కృష్ణాలో 12 మంది మృతి
*రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 69 మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మరణాలు సంభవించాయి. నెల్లూరులో ఏడుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, కడప జిల్లాల్లో అయిదుగు చొప్పున, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలులో ఇద్దరు మరణించారు.
*రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,59,94,607 నమూనాలు పరీక్షించారు.
*24 గంటల వ్యవధిలో 4,304 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

అన్ని పడకలూ నిండినవి

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్‌ వార్డులన్నీ నిండిపోయాయి. వెంటిలేటర్‌, ఐసీయూ, నాన్‌ ఐసీయూ, క్యాజువాలిటీ వార్డుల్లో పడకలు లేవని.. అన్నీ నిండాయని నోటీసు బోర్డులో పేర్కొన్న చిత్రమిది.

ఇదీ చదవండి

కరోనా తీవ్రత: దుర్గగుడి పాలక మండలి కీలక నిర్ణయాలు

Last Updated : Apr 26, 2021, 3:28 AM IST

ABOUT THE AUTHOR

...view details