తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 1,16,815 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా... 657 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,43,096కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 657 కేసులు, 2 మరణాలు - telangana varthalu
తెలంగాణలో కొత్తగా 657 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి బారి నుంచి 578 మంది బాధితులు కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం 9,314 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
తెలంగాణలో కొత్తగా 657 కేసులు
మహమ్మారి నుంచి మరో 578 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా బారిన పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,793కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,314 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: