రాష్ట్రంలో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 13 వేల98కు కరోనా కేసుల సంఖ్య చేరింది. రాష్ట్రానికి చెందిన 755 మందికి కరోనా పాజిటివ్‌గా తెలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50 మందికి,విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. కరోనాతో మరో 12 మంది మృతి చెందారు. కోవిడ్‌తో ఇప్పటివరకు 169మంది మరణించారు. కర్నూలు, కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందగా...పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లా,. విజయనగరం జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. ఆస్పత్రుల్లో 6,648 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 5,480 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు .24 గంటల వ్యవధిలో 24,458 మందికి కరోనా పరీక్షలను అధికారులు జరిపారు.
రాష్ట్రంలో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీలో కరోనా మరణాలు
కరోనా పాజిటివ్ కేసులు
13:16 June 28
రాష్ట్రంలో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Jun 28, 2020, 1:45 PM IST