రాజధాని అమరావతి అంశాన్ని కొన్ని శక్తులు వివాదాస్పదం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల ప్రకటనలతో రాజధాని ప్రాంతంలోని రైతులతో పాటు సాధారణ ప్రజానీకం తీవ్రమైన ఆవేదనకు గురవుతున్నారన్నారు. రాజధాని అంశంపై కాకుండా...రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని సూచించారు. రైతుల పక్షాన తమ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని వ్యాఖ్యనించారు.
'రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు' - over capital issue
రాజధాని అంశంపై మంత్రులు చేసే ప్రకటనల ద్వారా ఆప్రాంత రైతులు, సాధారణ ప్రజానీకం తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని సీపీఎం కార్యదర్శి మధు విమర్శించారు. కొన్ని శక్తులు ఈ అంశాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్నాయన్నారు.
సీపీఎం మధు