ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో భవన నిర్మాణ కార్మికుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరులోని మూడో వార్డుకు చెందిన అడపా రవి తాపీ మేస్త్రిగా పని చేస్తుండేవాడు. ఐదు నెలలుగా ఇసుక కొరత కారణంగా ఉపాధి కరవైంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. 3 లక్షల మేర అప్పులు చేశాడు. పని దొరక్క, అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన రవి.... పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడాడు. 4 రోజులుగా రవి దిగాలుగా ఉన్నాడని.. ఎవరితో సరిగా మాట్లాడలేదని కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి అన్నం తిని పడుకున్న రవి.. తెల్లారేసరికి ఇలా కనిపించాడంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
''అప్పులు తీర్చలేకే.. మా ఆయన చనిపోయాడు''
ఆర్థిక ఇబ్బందులు తాళలేక గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అడపా రవి అనే తాపీ మేస్త్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
construction-worker-sucide-at-ponnur-guntoor-district
TAGGED:
ఏపీలో ఇసుక కొరత వార్తలు