తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని ద్రోహుల పేరిట రైతులు దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతులు ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలను పోలీసులు తొలగించేందుకు చేసిన ప్రయత్నాన్ని అన్నదాతలు, మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు.
తుళ్లూరులో ఉద్రిక్త వాతావరణం.. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం - అమరావతి ఉద్యమం తాజా వార్తలు
తుళ్లూరులో రాజధాని ద్రోహుల పేరిట దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసేందుకు అమరావతి రైతులు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకోవటం ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
తూళ్లూరులో ఉద్రిక్త వాతావరణం
మందడంలో మూడు రాజధానులకు మద్దతుగా జరుగుతున్న దీక్షా శిబిరం వద్ద పెట్టిన దిష్టిబొమ్మలను తొలగించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఆ దిష్టిబొమ్మలు తీసిన తర్వాత తాము ఏర్పాటు చేసిన వాటిని తొలగిస్తామని పోలీసులకు తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: అమరావతి రైతుల పోరాటం వృథా కాదు: చంద్రబాబు