పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష - cm review on polavaram
పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. ఉన్నతాధికారులతో పాటు న్యాయనిపుణులు హాజరయ్యారు.
పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష
పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్షించారు. రీ టెండర్ల రద్దుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో... సీఎం సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశానికి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, న్యాయనిపుణులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడివరకూ వచ్చిందన్న విషయంతో పాటు.. తాజా పరిణామాలపైనా.. ముఖ్యమంత్రి చర్చించినట్టు సమాచారం.
TAGGED:
cm review on polavaram