'దియా జాలో ' అని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో.. దేశ ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి కరోనా బాధితులకు తాము అండగా ఉన్నామంటూ దిగ్విజయంగా దీపాలు, టార్చ్‌లైట్లు, మొబైల్‌ఫోన్ల లైట్లుతో తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కొవ్వొత్తులు వెలిగించారు. ముఖ్యమంత్రితో పాటుగా డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ నీలం సాహ్నీ దీపాలు వెలిగించారు.
కొవ్వొత్తులు వెలిగించిన ముఖ్యమంత్రి జగన్ - క్యాంపు కార్యాలయంలో దీపాలు వెలిగించిన సీఎం జగన్ న్యూస్
కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ..మోదీ ఇచ్చిన పిలుపుతో.. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ,డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ నీలం సాహ్నీ కొవ్వొత్తులు వెలిగించారు.
cm lighting for diya jalo for corona