కరోనా నియంత్రణలో తెలంగాణ నంబరు వన్‌గా ఉన్నట్లు.. సీఎం కేసీఆర్ శాసనసభలో పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యానే విద్యాసంస్థలను మూసివేయించామని స్పష్టం చేశారు. ఆ బాధతోనే విద్యాసంస్థలను మూసివేశామన్నారు. కరోనా విస్పోటనమైన రూపం తీసుకోకముందే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
కరోనాతో ప్రపంచమే తీవ్ర ఒత్తిడిలో ఉందని వ్యాఖ్యానించారు. ఎవరికి అంతుపట్టకుండా తెలంగాణ సహా ప్రపంచాన్ని వేధిస్తోందని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం చేతిలో ఉందని చెప్పారు. కేంద్రం టీకా డోసులను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. తాత్కాలికంగానే విద్యాసంస్థలు మూసివేసినట్లు ప్రకటించారు.
కొందరు సినీపెద్దలు నన్ను కలిశారు. మళ్లీ లాక్‌డౌన్‌పై వస్తున్న ప్రచారం గురించి అడిగారు. మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉందా అని అడిగారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టామని వివరించారు. కొన్ని సినిమాలు నిర్మాణ మధ్యలోనే ఉన్నాయని చెప్పారు. -సీఎం కేసీఆర్