'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని సీఎం కొనియాడారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.
'రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం' - మహిళా దినోత్సవం తాజా వార్తలు
రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని సీఎం జగన్ అన్నారు. మహిళా సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందన్నారు. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు
cm jagan wishes on international women day celebrations
వైకాపా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చింది సీఎం జగన్ గుర్తుచేశారు. అమ్మ ఒడి, వైఎస్‌ఆర్ చేయూత, ఆసరా, కాపు నేస్తం పథకాలు తెచ్చామని తెలిపారు. మహిళల పేరుతో ఇంటిపట్టాలు ఇచ్చామని.. సంపూర్ణ పోషణ, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. దిశ చట్టం, కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు తెచ్చామని సీఎం జగన్ అన్నారు.
ఇదీ చదవండి: రోగులకు అన్నీ తామై.. స్త్రీమూర్తుల సేవలు