ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Disha Patrol Vehicles: దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ - దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం

Disha patrol vehicles: ఏపీలో మహిళల రక్షణే ధ్యేయంగా తీసుకొచ్చిన దిశ చట్టంలో భాగంగా... దిశ పెట్రోలింగ్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. సచివాలయం మొదటి బ్లాక్ నుంచి సీఎం ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా 163 వాహనాలను కొనుగోలు చేశారు. గతంలోనూ అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు అందించారు.

CM  Inaugurated Disha Vehicles
దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

By

Published : Mar 23, 2022, 5:05 AM IST

Updated : Mar 23, 2022, 10:58 AM IST

దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

Disha patrol vehicles: ఏపీలో దిశచట్టం అమల్లో భాగంగా దిశ పెట్రోలింగ్‌ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రారంభించారు. సచివాలయం మొదటి బ్లాక్ నుంచి ముఖ్యమంత్రి లాంఛనంగా ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్​ను మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.

రాష్ట్రంలో కోటి 16 లక్షల మంది మహిళలు దిశా యాప్ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని సీఎం జగన్‌ తెలిపారు. దిశా యాప్ ద్వారా.. మహిళలకు వేగంగా రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 163 దిశా పోలీస్ వాహనాలతో పాటు.. బందోబస్తు సమయాల్లో మహిళా పోలీసులకు సౌకర్యవంతంగా ఉండేలా 18 కారా వ్యాన్‌లను విజయవాడలో సీఎం జగన్‌ ప్రారంభించారు. దిశా యాప్‌ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లోపే సహాయం అందేలా ప్రయత్నం చేస్తున్నామనని సీఎం వెల్లడించారు.

జరిగిన నేరానికి సంబందించిన వివరాలు, సమయం, ప్రాంతం వంటి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేస్తూ, ఆ సమాచారాన్ని దిశ పెట్రోలింగ్ వాహనాలను పోలీస్ విభాగం అనుసంధానించింది. ఇందులోభాగంగా 163 వాహనాలను కొనుగోలు చేశారు. జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుంచి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాలు కొనుగోలుకు రూ.13.85 కోట్లను వెచ్చించారు.

ఇదీ చదవండి:

మద్య నిషేధంపై చర్చంటే ప్రభుత్వానికి భయం: తెదేపా ఎమ్మెల్సీలు

Last Updated : Mar 23, 2022, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details