ఆసరా(YSR Asara), చేయూత పథకాల కింద కల్పించే ఆర్థిక లబ్ధిని మహిళలు సుస్థిర జీవనోపాధి కోసం వినియోగించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM JAGAN) పేర్కొన్నారు. ఈ సహాయం వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగపడాలన్నారు. మహిళల్లో స్థిరమైన ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను మరోసారి సమీక్షించి.. మరింత మందికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలపై బుధవారం సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు.
ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమ చేసుకోలేని విధంగా అన్‌ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో వేయాలి. రెండో విడత ఆసరా మొత్తంతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. ప్రభుత్వం ఉద్దేశాలపై మహిళల్లో అవగాహన కల్పించాలి. ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలి. స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులతో రుణాలు ఇప్పించి స్పాట్ డాక్యుమెంటేషన్ చేయించాలి. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు మార్కెటింగ్ సమస్య రాకూడదు. ఏ ఉపాధి ఎంచుకున్నా.. వారు నష్టపోకుండా విజయవంతమైన మహిళల అనుభవాలు చెప్పించాలి. ఇళ్ల లబ్ధిదారులకు పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణం ఇప్పించాలి. - సీఎం జగన్
చంద్రబాబు వల్ల డ్వాక్రా వ్యవస్థ ఛిన్నాభిన్నం: