ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్టోబర్​లో అవుకు టన్నెల్​ ద్వారా సాగునీరు.. సీఎం నిర్దేశం - avuku tunnel water projects news

రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్​.. అధికారులతో సమీక్షించారు. అక్టోబర్​లో అవుకు టన్నెల్​ ద్వారా సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. గడువు నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం పనుల పురోగతిపైనా చర్చించిన సీఎం.. ముంపు బాధితులను తరలించాలని, వర్షాకాలంలోనూ అంతరాయం లేకుండా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అక్టోబర్​లో అవుకు టన్నెల్​ ద్వారా సాగునీరు.. సీఎం నిర్దేశం
అక్టోబర్​లో అవుకు టన్నెల్​ ద్వారా సాగునీరు.. సీఎం నిర్దేశం

By

Published : Jun 25, 2020, 3:54 PM IST

అక్టోబర్​లో అవుకు టన్నెల్​ - 2 ద్వారా సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభించనున్న 6 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఆయన.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్​లోనే వెలిగొండ మొదటి టన్నెల్​ ద్వారా సాగు నీరు ఇవ్వాలని అన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజీల ద్వారా నీటిని ఇవ్వాలని స్పష్టం చేశారు.

అవుకు టన్నెల్​ - 2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి.. అక్టోబర్​లో ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వెలిగొండ టన్నెల్​ -1లో ఇంకా తవ్వాల్సింది 700 మీటర్లు ఉందని వివరించారు. వచ్చే అక్టోబరు నాటికి టన్నెల్​ -1 ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పారు.

నెల్లూరులో సంగం బ్యారేజీ పనులు సైతం అక్టోబర్​ చివరికి పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు.

సీఎం ఆదేశాలివే

  • డిసెంబర్​లో వంశధార, నాగావళి లింక్​ ద్వారా నీటిని విడుదల చేయాలి.
  • వర్షపు నీరు వచ్చే సమయంలోనూ చేసుకోదగ్గ పనులు చేసుకోవాలి.
  • నవంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లో గేట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలి.
  • పనులు ప్రణాళికాబద్ధంగా సాగకపోతే షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడుతుంది.. అందువల్ల తగు చర్యలు చేపట్టాలి.
  • పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలి.
  • రూ.3791 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్‌ పొందేలా చర్యలు తీసుకోవాలి.
  • వర్షాకాలంలోనూ అంతరాయం లేకుండా పోలవరం పనులు చేపట్టాలి.

ముంపు బాధితులకు ముమ్మరంగా పునరావాస పనులు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి..:'ప్రజావేదికను మళ్లీ కడతాం.. వైకాపా అరాచకాలను మ్యూజియంలో పెడతాం'

ABOUT THE AUTHOR

...view details