ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దిల్లీ చేరుకున్న సీఎం జగన్​.. కాసేపట్లో కేంద్రమంత్రులతో భేటీ! - cm jagan delhi tour news

ముఖ్యమంత్రి జగన్​ గన్నవరం ఎయిర్​పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

cm jagan
సీఎం జగన్​

By

Published : Jun 10, 2021, 11:33 AM IST

Updated : Jun 10, 2021, 2:04 PM IST

ముఖ్యమంత్రి జగన్.. దిల్లీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరిన సీఎం.. ఇవాళ, రేపు దేశ రాజధానిలో పర్యటిస్తారు. కాసేపట్లో.. కేంద్ర మంత్రులు జావడేకర్, షెకావత్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.

కేంద్రమంత్రులతో సమావేశంలో పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, ఆర్థిక సహాయాలపై చర్చించనున్నారు. అనంతరం సీఎం జగన్​... రేపు మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Last Updated : Jun 10, 2021, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details