రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువలో : సీఎం
ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి పనిచేస్తేసే విశ్వసనీయత నిలబడుతుందని సీఎం జగన్ అన్నారు. వివిధ వర్గాల ప్రజలకు చేయూత అందించేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించామన్న సీఎం... సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాలని స్పష్టం చేశారు. వడ్డీలేని రుణాల కింద డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందన్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని హామీ ఇచ్చిన జగన్... ముద్ర పథకం రుణాల పంపిణీ విస్తృతపరచడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. చిన్నచిన్న దుకాణాలు, తోపుడు బండ్ల చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు అందిస్తామని సీఎం అన్నారు. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువగా ఉందని బ్యాంకర్లు చెప్పడం సంతోషకరమని ముఖ్యమంత్రి అన్నారు.
'పెట్టుబడి సాయం ఇతర రుణాలకు జమ చేయొద్దు'
సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ముగిసింది. ఖరీఫ్ సీజన్ రుణ లక్ష్యం, కౌలురైతుల పెట్టుబడి సాయం, రైతు రుణాల పెండింగ్ అంశాలపై బ్యాంకర్లతో సీఎం చర్చించారు. వచ్చే నెల నుంచి ప్రారంభంకానున్న రైతు భరోసాపై సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. పెట్టుబడి సాయాన్ని ఇతర రుణాలకు జమ చేయవద్దని బ్యాంకర్లకు సీఎం స్పష్టం చేశారు.
సీఎంతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
ఇదీ చదవండి :