ఏపీ, తెలంగాణ మధ్య అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశముంది. ఇరు ఆర్టీసీలు నిత్యం 1.61 లక్షల కిలోమీటర్లు చొప్పున నడిపేందుకు సిద్ధమవగా... ఏపీ అధికారులు పంపిన ప్రతిపాదనలను తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అందులో కొన్ని మార్గాల్లోని సర్వీసుల సంఖ్యలో మార్పులు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో మార్పు చేసిన వివరాలను టీఎస్ఆర్టీసీ అధికారులు మంగళవారం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులకు పంపనున్నారు. ఏపీ అధికారులు వాటిని పరిశీలించి పంపిన తరువాత... ఇరు ఆర్టీసీల అంతర్ రాష్ట్ర ఒప్పందంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
మరోవైపు తొలుత శనివారం నాటికి స్పష్టత వస్తే దసరాకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఏపీలో వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు వీలుగా కొన్ని సర్వీసులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ భావించింది. తాజా నిర్ణయంతో ఆ అవకాశం లేకుండా పోయింది.