ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం - child missing

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పాలు ఇప్పిస్తానని నమ్మబలికి పాపను ఎత్తకెళ్లింది ఓ మహిళ. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం

By

Published : Nov 26, 2019, 1:58 PM IST

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం కలకలం సృష్టించింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన రమాదేవికి 15 రోజుల క్రితం పాప జన్మించింది. అనారోగ్యంతో ఉన్నందున ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఇవాళ ఉదయం గుర్తుతెలియని మహిళ రమాదేవి వద్దకు వచ్చింది. తల్లికి పాలు లేకపోవడం వల్ల... పాలు ఇప్పిస్తామని నమ్మబలికి పాపను తీసుకెళ్లింది. ఎంతసేపటికి తీసుకురాలేదు. వెంటనే రమాదేవి విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సీసీ టీవీ ఫుటేజీలో శిశువును తీసుకెళ్లిన మహిళను ఆస్పత్రి అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details