ఫిలిప్పిన్స్‌లో మృతి చెందిన తెలుగు విద్యార్థులు వంశీ, రేవంత్ కుమార్ భౌతిక కాయాలను రాష్ట్రానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అనంతపురం జిల్లాకు చెందిన వీరిద్దరూ వైద్య విద్య కోసం ఫిలిప్పిన్స్‌కు వెళ్లి ఈ ఉదయం ఐదున్నర గంటల సమయంలో అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని తెలిపారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఫిలిప్పిన్స్ వెళ్లిన వంశీ, రేవంత్ కుమార్‌లు అక్కడ సెబు నగరంలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందారన్న విషయం వారి తల్లిదండ్రులను తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మానవతా దృక్పథంతో తన వ్యక్తిగత వినతిని పరిగణనలోకి తీసుకుని మృతదేహాలను త్వరితగతిన రాష్ట్రానికి వచ్చేలా చొరవ చూపాలని కోరారు.
ఫిలిప్పిన్స్‌లో రాష్ట్ర వాసి మృతి... విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ - ఫిలిపిన్స్ ప్రమాదంపై చంద్రబాబు లేఖ
ఫిలిప్పిన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అనంతపురం వాసులు వంశీ, రేవంత్ కుమార్ భౌతికకాయాలను రాష్ట్రానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని తెదేపా చంద్రబాబు కోరారు. ఈ మేరకు విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు.
ఫిలిప్పిన్స్ ఘటనపై.. విదేశాంగమంత్రికి చంద్రబాబు లేఖ
Last Updated : Apr 6, 2020, 8:33 PM IST