తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల రాజధానిలో పర్యటించినపుడు తలెత్తిన ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణకు ఆదేశించినట్లు గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. గుంటూరులో ఆయన రూరల్ ఎస్పీ సీహెచ్.విజయారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి వారంరోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించామని చెప్పారు. గుంటూరు గ్రామీణ అదనపు ఎస్పీ (క్రైమ్) సిట్‌కు నేతృత్వం వహిస్తారన్నారు.
చంద్రబాబు పర్యటనలో ఘటనలపై ‘సిట్’ - chandrababu latest news
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల రాజధానిలో పర్యటించినపుడు తలెత్తిన ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణకు ఆదేశించినట్లు గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు.
ఆ రోజు పోలీసులు విధినిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యం వహించారా? వారి వైఫల్యం వల్ల రాజధాని ప్రాంతంలో రైతులు బాబు కాన్వాయ్‌ని అడ్డుకున్నారా అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు జరుగుతుందని ఐజీ వివరించారు. పోలీసు విధులపరంగా ఏమైనా లోపాలు, తప్పిదాలు ఉన్నాయని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఉద్రిక్తత తలెత్తేలా వ్యవహరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని, బాబు కాన్వాయ్‌పై చెప్పు, రాయి విసిరిన ఉదంతాలను సిట్ నిగ్గు తేలుస్తుందని ఆయన చెప్పారు.