ఒక పక్క వరదలు, మరో పక్క కరెంటు లేక ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇళ్లల్లోకి ఏ పాములు కొట్టుకొస్తాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పిల్లా పాపలతో కుటుంబాలు నరకాన్ని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. తక్షణమే సహాయ, పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వరదల్లో చిక్కుకున్న ఒక బాధితుడి ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
'ప్రజల బాధ వర్ణనాతీతం.. వెంటనే ఆదుకోండి' - floods
వరదలతో ఒక పక్క...కరెంట్ లేక మరోపక్క... ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల బాధ వర్ణనాతీతం.. వెంటనే ఆదుకోండి: చంద్రబాబు