Chandrababu letter to CS : వరదల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు... తెలుగుదేశం అధినేత చంద్రబాబు(tdp cheaf chandrababu) డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ఆరోపించారు. తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చడం వల్లే... తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తాయని మండిపడ్డారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరదలతో భారీ ప్రాణ నష్టంతోపాటు... ఆస్తి, పంట నష్టం సంభవించాయని ఆవేదన చెందారు. రోడ్లు, వంతెనలతోపాటు విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని లేఖలో ప్రస్తావించారు.
Chandrababu letter to CS: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు...చంద్రబాబు లేఖ - CBN Letter to CS Sameer Sharma
Chandrababu letter to CS: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు...సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు.
వరద తగ్గి చాలా రోజులైనా ఇప్పటికీ బాధితులు తిండి, నీళ్లు లేక అల్లాడుతున్నారని... మరికొందరికి కనీసం తల దాచుకునే వసతి లేక రోడ్ల మీదే ఉన్నారన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు, మిగిలిన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టివ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారమే 6 వేల 54 కోట్ల నష్టం జరిగితే... బాధిత ప్రాంతాలకు కేవలం 35 కోట్లు విడుదల చేయడం ఏంటని ప్రశ్నంచారు. ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు చేయాల్సిన 11వందల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. నిధుల మళ్లింపు జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ నిబంధనలకు విరుద్ధమన్నారు.
ఇదీ చదవండి:RAINS: నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షం...ఆందోళనలో ప్రజలు