భవన నిర్మాణ కార్మికులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ తెదేపా వారి తరపున పోరాడుతుందని ఉద్ఘాటించారు. తుగ్లక్ పాలనతో రోడ్డున పడిన కార్మికులకు... ఒక్కో కుటుంబానికి రూ.60వేల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో ఉచిత ఇసుక యూనిట్ ధర రూ.1200 ఉంటే... వైకాపా రివర్స్ టెండరింగ్ మాయాజాలంతో రూ.10వేలు చేసిందని విమర్శించారు.
'వైకాపా ధన దాహంతో.. కార్మికులు రోడ్డున పడ్డారు' - cm jagan
కార్మికులకు అండగా తెదేపా శ్రేణులు పోరాటం చేస్తుంటే... వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తామంటే... ఊరుకోమన్నారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
వైకాపా నేతలు ఇసుక నుంచి తైలం తీయగల సమర్థులని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. వాళ్ల ధన దాహంతో 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. సిమెంట్ బస్తాకు రూ.10 జె-ట్యాక్స్ కట్టే వరకూ... ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వం వెంటనే ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇసుకపై ఉద్యమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను అభినందించారు.
ఇదీ చదవండీ... 'ఆంధ్రాబ్యాంక్'... ఇక కనపడదు