ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరద బాధితులకు రూ.10 వేలు సాయం అందించాలి : చంద్రబాబు

రాష్ట్రంలో సమస్యలు తలెత్తినపుడు గట్టెక్కించే నాయకత్వం లేకుండా పోయిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వరదలపై ముందస్తు సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోనందువల్లే ప్రజలు వరద కష్టాల బారిన పడ్డారని ఆరోపించారు. కరోనా వ్యాప్తిలో దేశంలో అన్ని రకాలుగా మొదటి స్థానానికి చేరడం ప్రభుత్వం నిర్వాకమేనని మండిపడ్డారు. చివరకు జూనియర్‌ వైద్యులు, నర్సులు హెచ్చరించే పరిస్థితి తెచ్చారన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Aug 25, 2020, 6:02 AM IST

వరద బాధితులకు రూ.10 వేలు సాయం అందించాలి : చంద్రబాబు

వరద బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున సాయం అందించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 2 వారాలు దాటుతున్నా గోదావరి వరద బాధితులను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కనీసం ఎక్కడా విద్యుత్ కూడా పునరుద్ధరించలేని పరిస్థితి ఉందన్నారు. హుద్ హుద్, తిత్లీ తుపాన‌్ల సమయంలో తాము ఇచ్చిన స్థాయిలో ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సర్కారు ఘనంగా చెప్పుకొనే వాలంటీర్ల వ్యవస్థ కరోనా కట్టడిలో ఎందుకు విఫలమైందో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 17 శాతం పాజిటివ్‌ రేటుతో దేశంలోనే నంబర్‌ వన్‌గా రాష్ట్రం మారిందన్నారు.

రాజధాని రైతులతో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే నష్ట పరిహారం కోరే చట్టబద్ధమైన హక్కు వారికి ఉందన్న చంద్రబాబు అంత చెల్లించే శక్తి ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. అమరావతిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా ఏపీ విత్‌ అమరావతి పేరుతో ఓ వెబ్‌సైట్‌ను చంద్రబాబు అందుబాటులోకి తెచ్చారు.

ఇదీ చదవండి :తెనాలి రచయితకు మహారాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం

ABOUT THE AUTHOR

...view details