కడప జిల్లా జమ్మలమడుగులో ఏపుగా ఏదిగిన పత్తిపంటను పలువురు ధ్వంసం చేయటంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జిల్లాలోని బేస్తవేముల గ్రామంలో నల్లబోతుల నాగయ్య... గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా నిలిచారు. ఇప్పుడు వైకాపా నాయకులు... అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకొని నాగయ్య బోర్‌ను సీజ్ చేశారు. ఈ చర్యను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
పండించుకుంటున్న పత్తి పంటను సర్వనాశనం చేసి... రైతు నోటికాడి ముద్దను లాగేయడం అమానుషమని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... రైతులను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 5 వేల 400 దానిమ్మ చెట్లను నరికివేసి... భూములను లాక్కున్నారని ఆగ్రహించారు. తూర్పు గోదావరిలో కొబ్బరి చెట్లను నరికేశారని ఆక్షేపించారు.