హరిత నగరాల ద్వారానే మెరుగైన జీవనం, మంచి భవిష్యత్ సాధ్యమని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఏకీకృత పర్యావరణానికి గ్రీన్ సిటీ మెరుగైన పరిష్కారమని ఆయన అన్నారు. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
హరిత నగరంగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేసేందుకు బృహత్ ప్రణాళిక రచించామని, పర్యావరణంలో ప్రజా జీవితం, జీవనోపాధి అనుసంధానమయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా హరిత నగరాల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. స్థిరమైన పర్యావరణ నగరాలతో జీవితాలను పునరుద్ధరించుకోవచ్చని, అమరావతి వంటి హరిత నగర నిర్మాణానికి ఎంతో దూరదృష్టి అవసరమని చంద్రబాబు అన్నారు.