మైనారిటీల సమస్యలపై జాతీయ స్థాయిలో తన వాణిని వినిపించి.. వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా... వర్థంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. పార్టీకి, ప్రజలకు బాషా చేసిన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో లాల్ జాన్ బాషా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముస్లిం సమస్యలపై జాతీయ స్థాయిలో గళం వినిపించారని గుర్తు చేసుకున్నారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివ రావు, అనగాని సత్య ప్రసాద్, ఎవి రమణ, నరేంద్ర పాల్గొన్నారు.