ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవో 203తో విద్వేషాలు పెంచుతున్నారు: చంద్రబాబు - tdp mahanadu news

జీవో 203తో విద్వేషాలు పెంచేందుకు వైకాపా ప్రభుత్వం చూస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వ హయంలో సాగర్​కు గోదావరి జలాలు ఇచ్చి, శ్రీశైలంలో పొదుపు జలాలు రాయలసీమకు ఇచ్చేలా ప్రణాళికలు చేశామని వివరించారు.

chandrababu
chandrababu

By

Published : May 27, 2020, 3:00 PM IST

పోలవరం ప్రాజెక్టు పనులను గత ఏడాదిగా నిలిపివేశారని చంద్రబాబు అన్నారు. కాంట్రాక్ట్ రద్దు చేసి కావాల్సిన వాళ్లకు ఇచ్చారని ఆరోపించారు. సాగర్‌కు గోదావరి జలాలు ఇచ్చి, శ్రీశైలంలో పొదుపు జలాలు రాయలసీమకు ఇచ్చేలా ప్రణాళిక చేశామని వివరించారు. ఏపీ, తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ ప్రారంభించింది తెదేపానేనని పేర్కొన్నారు. పంచనదుల అనుసంధానం ద్వారా నీటి కొరత లేకుండా చేయాలని చూశామని వెల్లడించారు.

పోతిరెడ్డిపాడు పనులను ప్రారంభించింది ఎన్టీఆర్​ అని చంద్రబాబు గుర్తు చేశారు. జీవో 203 పేరుతో విద్వేషాలు పెంచుతున్నారని ఆక్షేపించారు. ముచ్చుమర్రి ద్వారా సీమకు నీళ్లిచ్చింది తెదేపానే అని చెప్పారు. దోచుకో-దాచుకో అనేదే వైకాపా లక్ష్యమని దుయ్యబట్టారు.

వైకాపా పాలనలో ఎక్కడ చూసిన బలవంతపు వసూళ్లు, భూకబ్జాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యసేతు యాప్ రూపొందించిన వ్యక్తులను బెదిరిస్తారా..? ప్రభుత్వ ఆస్తులు అమ్మే అధికారం ఎవరిచ్చారు? విశాఖ ఘటనలో బాధితులకు అండగా ఉండకుండా.. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి వంత పాడతారా..? కంపెనీతో డబ్బు ఇప్పించకుండా ప్రభుత్వం నుంచి పరిహారం ఇస్తారా..? - చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..?

ABOUT THE AUTHOR

...view details