తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం హైదరాబాద్ నుంచి అమరావతికి తిరిగి రానున్నారు. దాదాపు 50 రోజుల విరామం తర్వాత ఆయన ఏపీకి తిరిగి రానున్నారు. ఈఎస్ఐ కేసులో బెయిల్ పై విడుదలైన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడును పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి పర్యటనలో ఉన్న అచ్చెన్నాయుడు తన పర్యటన ముగించుకుని అమరావతిలో చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం.
ఇవాళ అమరావతికి తెదేపా అధినేత చంద్రబాబు - atchannaidu arrest
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతికి రానున్నారు. హైదరాబాద్ నుంచి బుధవారం అమరావతికి చేరుకుంటారు. ఈఎస్ఐ కేసులో జైలు నుంచి విడుదలైన అచ్చెన్నాయుడుతో చంద్రబాబు సమావేశం అవుతారని సమాచారం.
chandrababu