ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dattatreya birthday: 'సోదరభావంతో ఆప్యాయంగా ఆదరించే వ్యక్తి దత్తాత్రేయ' - Governor Bandaru Dattatreya

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ జన్మదిన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

bandaru dattatreya birthday
bandaru dattatreya birthday

By

Published : Jun 12, 2021, 8:56 PM IST

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరినీ సోదరభావంతో ఆప్యాయంగా దత్తాత్రేయ ఆదరిస్తారని చంద్రబాబు గుర్తుచేశారు. ఏ చోట ఉన్నా తెలుగువారిని, తెలుగునేలను క్షణం మరువని దత్తాత్రేయ నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రజా, రాజకీయ జీవితంలో ప్రజలకు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని లోకేశ్ కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details